నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం వివిధ గ్రామాల మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి మాట్లాడుతూ ఈనెల 22న నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయని ఆలయంలో భవాని మాలధారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2న విజయదశమి వేడుకలు ఉంటాయని తెలిపారు. ప్రతిరోజు అన్నప్రసాద వితరణ ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.