పిప్పల్ కోటి రిజర్వాయర్ భూనిర్వాసిత రైతులకు నష్టపరిహారం రెట్టింపు చేసి వెంటనే చెల్లించాలని సీపీఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. భూనిర్వాసిత రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లేష్ మాట్లాడుతూ.. 7 ఏళ్ల క్రిందట ఇవ్వాల్సిన నష్టపరిహారo ఇప్పటి వరకు చెల్లించక పోవడం అన్యాయం అన్నారు. ఆరోజు నిర్ణయించిన ధర ఎకరాకు రూ.8 లక్షలు అన్నారు. ప్రస్తుతం భూమి విలువ రెట్టింపు అయినందున నష్టపరిహారం రెట్టింపు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లోనే రైతుల నష్టపరికరం కు సంబందించిన బడ్జెట్ ను విడుదల చేయాలన్నారు.