బొమ్మనహాల్ మండలం ఉప్పరహాల్ గ్రామానికి చెందిన రైతులు యూరియా కోసం యూరియా లోడుతో వెళుతున్న లారీలను అడ్డగించారు. శుక్రవారం రాత్రి సింగానహళ్ళి, శ్రీధరగట్టలోని ప్రైవేటు ఏజెన్సీ లకు 2 లారీల్లో యూరియా లోడు వెళుతుందన్న సమాచారం తెలుసుకున్న రైతులు వాటిని అడ్డగించారు. తమ గ్రామానికి యూరియా సరఫరా చేయకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు పంపడమేంటని మండిపడ్డారు. ముందుగా తమ గ్రామంలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నబిరసూల్ అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పడంతో రైతులు శాంతించారు. అధికారులతో మాట్లాడి యూరియా వచ్చేలా చేస్తామని ఎస్ఐ రైతులకు తెలిపారు.