మహిళా రిజర్వేషన్ తో పాటు వారికి ఓబీసీ సెల్ కోట ఇవ్వాలని బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు జరగాలంటే కుల గణన జరగాలని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఓబీసీ సబ్ కోటాకు ఈనెల 30న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట వందలాదిమందితో ఒక్కరోజు దీక్ష నిర్వహిస్తున్నట్లు శంకర్రావు ప్రకటించారు.