ప్రజల చేతిలో ప్రభుత్వం వంటి మనమిత్ర సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆళ్లగడ్డ ఎంపీడీఓ నూర్జహాన్ తెలిపారు. శనివారం కొటకందుకూరులో సిబ్బంద తో ఆమె ఇంటింటికీ తిరిగి మనమిత్ర సేవలపై అవగాహన కల్పించారు. వాట్సాప్ 9552300009 నంబర్ను ప్రతి ఒక్కరూ మనమిత్ర పేరుతో సేవ్ చేసుకోవాలన్నారు. హాయ్ అని సందేశం పంపడం ద్వారా మీకు కావాల్సిన సేవలను ఎంపిక చేసుకొని, అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చన్నారు.