రామాయంపేట మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయంలో అంతర్జాతీయ స్పేస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి శ్రీనివాసరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 రాకెట్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో ఎన్నో ఏళ్ల స్వప్నం సాకారమైందని, దీంతో ప్రపంచంలో నాలుగో దేశంగా భారతదేశం అవతరించిందని, అదేవిధంగా దక్షిణాద్రవంపై మొదటిసారిగా అడుగుపెట్టిన దేశంగా ఆచరించిందని, ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేసిన కృషి కి గాను ఈ రోజు అంతరిక్ష దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.