ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ వైరు తెగి శుక్రవారం ఉదయం రోడ్డుపై పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు మాజీ కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్కు సమాచారం అందించగా ఆయన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసి లైన్ పునరుద్ధరణ చేపట్టారు