విద్యార్థులు తప్పులను సరిదిద్దు సరైన మార్గంలో నడిపించే వాడే నిజమైన ఉపాధ్యాయుడని బెజ్జూరు ఎంఈఓ సునీత అన్నారు. బెదురు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి బోధన చేసిన తీరును ఎంఈఓ సునీత ప్రశంసించారు. ఉపాధ్యాయుడు కొవ్వొత్తుల కరిగి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతాడని పేర్కొన్నారు.