మెదక్ జిల్లా కేంద్రంలోని గోల్కొండ వీధి గాంధీ నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ శుక్రవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఇబ్బందులు పడకుండా ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.