ప్రజా కొనుగోలు శక్తిని పెంచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ స్లాబ్ లను తగ్గించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లో ఆయన మీడియా తో మాట్లాడారు. ప్రధాని ఏ మంచి పని చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలకు కడుపు మంట ఉంటుందని ఎద్దేవా చేశారు. నాలుగు స్లాబ్ లను జీఎస్టీని రెండు స్లాబ్ లకు కుదించారని పేర్కొన్నారు. తగిన జిఎస్టి రేట్లతో రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందని ఆయా పార్టీలు మాట్లాడడం సరికాదన్నారు