మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో హనుమంతుగుండం సొసైటీని అభివృద్ధి చేస్తామని నూతన అధ్యక్షుడు మూల శివారెడ్డి పేర్కొన్నారు. గురువారం కొలిమిగుండ్ల మండలంలోని హనుమంతుగుండం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా మూల శివారెడ్డి, సభ్యులుగా వెంకటేశ్వరరావు, దస్తగిరి ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నాయకులు వీఆర్ లక్ష్మిరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, రామదాసు, పులి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.