రైతు భరోసా కేంద్రాలు దోపిడీ నిలయాలుగా మారాయని రాష్ట్రంలోని రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.