పల్నాడు జిల్లాలో యూరియా వంటి ఎరువుల కోసం రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల చివరిలో యూరియా జిల్లాకు దిగుమతి అవుతుందన్నారు. ఎరువులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే డీలర్ల పైన యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు టీంలు జాయింట్ యాక్షన్ నిర్వహిస్తున్నాయన్నారు.