రైల్వే కోడూరు నియోజకవర్గం లో అభివృద్ధి పనులు గ్రామస్థాయి వరకు చేరేలా తన కృషి కొనసాగుతుందని రైల్వే కోడూరు నియోజకవర్గ కోడూరు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి స్పష్టం చేశారు. కోడూరు మండలం రాఘవరాజు పురం అరుంధతి వాడ, గంగరాజు పురం అగ్రహారం గ్రామాలలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.