శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో వినాయక నిమజ్జనం శనివారం సాయంత్రం కనుల పండువగా సాగింది.సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సంస్థల్లో నెలకొల్పి మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి వివిధ రూపాలలో ఉన్న వినాయక ప్రతిమలను నిమజ్జనానికి తరలించారు.విద్యార్థుల వేద పఠనం తో ప్రారంభమైన నిమజ్జనం గణనాథుని నామాన్ని జపిస్తూ భజనలు చేస్తూ వినాయకులను పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, విమానాశ్రయం, మ్యూజియం, సత్యసాయి కళాశాల, జనరల్ ఆస్పత్రి వంటి ఆకృతులపై కొలువుదీరిన వినాయకులను ఊరేగింపు నిర్వహించారు.