సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని ఎమ్మెల్యే మాణిక్ రావు పరామర్శించారు. బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ విజయ్ ఇటీవల తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం సాయంత్రం బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి వారి కుటుంబానికి వెళ్లి పరామర్శించి ప్రమాద తీరుతో పాటు ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు పలువురు బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు