కోడుమూరు పట్టణ శివారులో మంగళవారం పొలం పిలుస్తోందిలో భాగంగా వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పత్తి తీసే సమయంలో గ్రేడింగ్ చేసుకోవాలని తద్వారా నాణ్యమైన పత్తికి మార్కెట్లో మంచి ధర లభిస్తుందన్నారు. ప్రస్తుతం రసాయనిక ఎరువుల అవసరం లేదని 19.19.19 లేదా మైక్రో న్యూట్రిన్స్ స్ప్రే చేసుకోవాలన్నారు. దోమ, పచ్చ పురుగు గమనిస్తే నివారణ చర్యలు చేపట్టాలన్నారు.