సూర్యాపేట జిల్లా మోతే మండలం నామవరం లో సి ఆర్ ఆర్ నిధులు రూ.4 కోట్లతో నామవరం నుంచి సీతానగరం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ బీటీ రోడ్డు నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. మోతే మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు.