పుట్లూరులోని పోలీస్ స్టేషన్ సీఐ సత్యబాబు వినాయక చవితి వేడుకలపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న నిర్వాహకులతో సమావేశమై వినాయక చవితిని ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కోమటికుంట్లలో విద్యుత్ షాక్కు గురై రాజేశ్ అనే యువకుడు మృతి చెందారన్నారు.