గత ప్రభుత్వ హయాంలో ప్రజలపై చెత్త పన్ను వేసి రాష్ట్రంలోని చెత్తను ఎక్కడపడితే అక్కడ వదిలి వెళ్ళిపోయారని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించని ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని మండిపడ్డారు.