మంచిర్యాల రైల్వే స్టేషన్ లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 110 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టణ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం దూట అభిలాష్ అనే వ్యక్తి బల్లార్ష వెళ్లి అక్కడ 110 గ్రాముల గంజాయిని కొని మంచిర్యాలకు తిరిగి వస్తుండగా ఎస్సై తన సిబ్బందితో కలిసి ఆ వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.