ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి కమల డిమాండ్ చేశారు. గురువారం బాపట్లలో నిర్వహించిన ఆశా వర్కర్స్ యూనియన్ మహాసభలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వేతనాలపై మాట్లాడటం లేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలన్నారు. నాణ్యమైన ఫోన్లు, సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.