గుంటూరులో ప్రసిద్ధిగాంచిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పడిన కమిటీ నుండి స్థానిక ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తున్నట్లు వైసిపి పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఆర్యవైశ్య నేత, కార్పొరేటర్ బస్సు బాబు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత వైసిపి పాలనలో దేవస్థానాన్ని ఎండోమెంట్ కి అప్పగించడం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నమని తెలిపారు.