అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం లో అన్ని మండలాల్లో మంగళవారం వైయస్సార్ వర్ధంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మాజీ సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని పీలేరు నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో వైయస్సార్ విగ్రహాలకు మరియు చిత్రపటాలకు పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్సార్ పేద ప్రజలకు చేసిన సేవలు గురించి వారు కొనియాడారు.