భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడికి పాల్పడిన ఘటన మధిర రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర మండలం మాటూరుకు చెందిన 30 ఏళ్ల సూర్యనారాయణ 26 ఏళ్ల తన భార్య సాయి నాగలక్ష్మి పై అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నాగలక్ష్మికి గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మధిర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.