నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తూడిచెర్ల గ్రామంలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యూరియా కోసం తుడిచెర్ల గ్రామంలోని సచివాలయం వద్ద రైతులు బారులు తీరారు, పాస్ పుస్తకాలు ఆధార్ కార్డు వెంట తెచ్చుకున్నప్పటికీ ఏరియా కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, యూరియా పంపిణీలో వ్యవసాయ అధికారుల తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు, యూరియా పంపిణీలో గందరగోళం లేకుండా తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.