రాజోలు పల్లిపాలెం ఏటిగట్టును ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఏటిగట్టు ఏరియాలలో ఉన్న సమస్యలపై ఆయన అధికారులతో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏటిగట్టు అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. మోకలపాలెం నుంచి నున్నవారి బాడవ చివరి వరకు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు.