కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వల్లూరు మండలంలోని కడప తాడిపత్రి జాతీయ రహదారి తప్పేట గ్రామం రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర బుధవారం త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.వల్లూరు మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డివైడర్ను ఢీ కొట్టి సేఫ్టీ యస్ యస్ రైలింగ్ పై ఎక్కిందన్నారు.ఆ సమయంలో బస్సులో కేవలం 12 మంది పిల్లలతో వెళ్తున్నట్లు తెలిపారు.బ్రిడ్జి కి ఇరువైపులా సేఫ్టీ యస్ యస్ రైలింగ్ ఉండడంతో తగ్గులో పడకుండా అంతటితో నిలిచిన బస్సు.స్వల్ప గాయాలతో స్కూల్ విద్యార్థులు బయట పడ్డారు.