మూలపేట పోర్టు నిర్మాణానికి సంబంధించి పునరావాస అంశాలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో టెక్కలి ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పునరావాస గ్రామాల నిర్మాణం, స్థలాల కేటాయింపు, మౌలిక వసతులు, గృహ నిర్మాణాలు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై చర్చించారు. తాగునీటి సరఫరా, రహదారి అనుసంధానం, పునరావాస ప్రక్రియ, విశేష గ్రామాల పరిధిలోని ఖాళీ స్థలాల వినియోగంపై అధికారులు చర్చించారు. పోర్టు రహదారికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు, సమీక్ష నిర్వహించారు