కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం చిలుమకూరు గ్రామంలో ఉండే యానాది కాలనీ గత కొన్ని నెలల నుండి తాగునీరు వాటర్ ట్యాంకు దగ్గర విపరీతమైన డ్రైనేజ్ నీరు చేరడం వలన ఇబ్బంది పడుతున్నట్లు గురువారం యానాది కాలనీ వాసులు తెలిపారు. తమ సమస్యలను పంచాయతీ ఆఫీసు వారికి తెలియజేశామన్నారు. యానాది కాలనీలో క్లీనింగ్ నోచుకోక కాలనీలో జ్వరాలు,విష సర్పాలు సంచరిస్తున్నాయన్నారు. మరియు కొన్నిచోట్ల వీధి దీపాలు లేవన్నారు.ట్యాంక్ పరిసరాలను క్లీనింగ్ చేయమని పంచాయతీ అధికారులకు,గ్రామ సర్పంచ్ కు యానాది కాలనీవాసులు కోరుతున్నారు.