ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రేషన్ డీలర్ల కమిషన్ ఇప్పించాలంటూ రుద్రూర్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తహసీల్దార్ కార్యాలయం లో. వినతి పత్రం అందజేశారు. రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుండి కమిషన్ రానందున అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఏప్రిల్, మే, జూన్ మాసంలో మూడు నెలల బియ్యాన్ని అత్యంత పాదదర్శకంగా జిల్లాలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా కమిషన్ విడుదల చేయడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.