సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులోని బీదర్ రహదారిపై రైల్వే గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. జహీరాబాద్ నుండి ముంగి గ్రామానికి దైవదర్శనానికి ఓకే కుటుంబానికి చెందిన ఏడు మంది కారులో వెళుతుండగా ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో దండి వెంకటేశం, సాయి అనే ఇద్దరు మృతి చెందారన్నారు. నాగేశ్వరరావు, వరలక్ష్మి, రిషికేష్, హరి చందన, జాహ్నవి తీవ్రంగా తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నాగేశ్వరరావు ఫిర్యాదుతో లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.