వరద ప్రవాహం తగ్గడంతో కొమురం భీం అడ ప్రాజెక్టులోకి 3,611క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లను మాత్రమే తెరిచి 3,999 క్యూసెక్కుల నీటిని పెద్దవాగులో వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెద్దవాగులో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.