తవణంపల్లె మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ ఘనంగా ప్రారంభించారు. గురువారం ఉదయం తవణంపల్లెలోకి చేరుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ గారిని మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ, తవణంపల్లె మండల కార్యాలయం భవిష్యత్తులో కార్యకర్తల ఆవాసంగా, ప్రజా సమస్యల పరిష్కార కేంద్రం