అమరావతిలోని నెమలికల్లుకు చెందిన షేక్ సుభానీ (45) కృష్ణానదిలో గల్లంతయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న భార్యను చూసేందుకు వచ్చిన సుభానీ, శనివారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు, గజ ఈతగాళ్లు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. వలల సాయంతో సుభానీ మృతదేహాన్ని వెలికితీశారు.