కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్ను శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ సెల్వరాజ్ తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. పేదలకు మూడు పూటలా పరిశుభ్రమైన ఆహారం అందివ్వాలన్న ఉన్నత ఆశయంతో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయాన్ని గుర్తించుకొని వృథా చేయకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.