సెట్టూరు మండలం ముద్దలాపురం గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఈశ్వరప్ప అనే వృద్ధుడు ఒంటరి జీవితం భరించలేక గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు ఉరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈశ్వరప్ప గత 25 సంవత్సరాల క్రితం భార్య, పిల్లల నుంచి విడిగా ఉంటున్నాడు. ఒంటరితనంతో బాధపడుతుండేవాడు. క్రమంలో జీవితంపై విరక్తి చెంది చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై సెట్టూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.