ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామ సమీపంలో ఇద్దరు యువకులు శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విజయవాడలోని కాలేజీలో చదువుతున్న బ్రహ్మయ్య విష్ణు దసరా సెలవుల కోసం ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లలు ఇంటికొస్తారనుకుంటే ఇప్పుడే వాళ్ళ మృతదేహాలు వచ్చాయని తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.