రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా పోలీసులు ఆద్వర్యంలో మహిళలు మరియు చిన్నారుల రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా డీఎస్పీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అందరూ శక్తి యాప్‌న్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థినిలు ఆత్మరక్షణ ఏలా చేసుకోవాలనే అంశంపై నేర్చుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని డీఎస్పీ సూచించారు