మంత్రాలయం: నియోజవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో మరియు గ్రామాలలో బుధవారం ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం లో పీఠాధిపతి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు కౌతాళం మండలంలోని ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్ కే వాణి వినాయక చతుర్ధి సందర్భంగా వినాయకుడికి పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాలలో వాడ వాడలా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.