ఆళ్లగడ్డలో నేడు గణేశ్ నిమజ్జనం సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీనియర్ లైన్మెన్ తాళ్ల శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని చెట్ల కొమ్మలను తొలగించి అలాగే విద్యుత్ తీగలు విగ్రహాలకు తగలకుండా చర్యలు చేపట్టారు. లైన్మెన్ నాగరాజు, AFM కొండారెడ్డి పాల్గొన్నారు.