శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చేతన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు అందుబాటులో ఉన్న మందులు వైద్య సేవలు తదితర సదుపాయాలపై ఆసుపత్రి సూపర్డెంట్ తో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎన్ని కేసులు నమోదయాయని వాటి వివరాలను తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని తెలియజేశారు.