కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం పిండ ప్రధానాలు పితృ కార్యాలకు ప్రసిద్ధి శుక్రవారం అమావాస్య కావడంతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతుండగా ఇతర ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి పితృ కార్యాలకు అనేక మంది విచ్చేశారు. అధికారులు పిండ ప్రధానాలు కోనేరు వద్ద నిర్వహించరాదని ఆదేశించారు. ఇతర ప్రాంతాల్ని వచ్చిన వారు రోడ్లపైనే పితృ కార్యాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను మరలా రాకుండా చూడాలని పురోహితులు మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా పూర్వకంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.