మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామ శివారులోని రైస్ మిల్లులో కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మృతదేహానికి సరిగ్గా పోస్టుమార్టం నిర్వహించకపోవడంతో అంత్యక్రియలకు సిద్ధమైన మృతదేహాన్ని తిరిగి అల్లాదుర్గం పోలీసులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల సమయంలో రి పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో బంధువులు అంతా షాక్ అయ్యారు. వైద్యుల పోస్టుమార్టం నిర్వహించే క్రమంలో పోలీసుల దర్యాప్తులో ఉపయోగపడే స్టేర్నo ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు వైద్యులు పంపించలేదని తెలిపారు