వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు పొందాలని పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ప్రమాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.