యాంకర్: జగిత్యాల జిల్లా మెట్‌పల్లికున్న చరిత్రను గుర్తించిన గత ప్రభుత్వం, మెట్పల్లిని రెవెన్యూ డివిజన్గా పరిగణించడమే కాకుండా, సబ్ కలెక్టర్ హోదాను కల్పించింది. కానీ, సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలిగించి, రెవెన్యూ డివిజన్ పేరుతో సైన్ బోర్డును మార్చడంతో, రెవెన్యూ డివిజన్ సాధన కమిటి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్‌పల్లికి పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులను వారు కోరారు.ఈ మేరకు, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో, మెట్‌పల్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.