కడప జిల్లా కమలాపురంలో శుక్రవారం సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు ఎంవి సుబ్బారెడ్డి, సిపిఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ఏ ఒక్కరూ ఉల్లి కొనుగోలు చేయడం లేదన్నారు.క్వింటా 1200 రూపాయలతో కొనుగోలు చేస్తాము రైతులు సద్వినియోగం చేసుకోమని ఇన్చార్జి కలెక్టర్ అధితిసింగ్ ఒకప్రకటనలో తెలిపారన్నారు..కానీ క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు లేకపోవడం బాధాకరం అన్నారు ఎందుకంటే రైతాంగం ఉల్లి పంటను నిలువ ఉంచుకునే సౌకర్యం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.