కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమైందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాజమండ్రి లో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటమీ ప్రకటించిన ప్రతి పథకంలో మోసం దాగి ఉందన్నారు .అర్హులైన వారికి పథకాలు ఇవ్వకుండా మభ్యపెడుతుందంటూ ధ్వజమెత్తారు.