అనంతపురం నగర శివారులోని రైలు కింద పడి మృతి చెందిన మృతుడి ఆచూకీలభ్యమైందని అనంతపురం రైల్వే ఎస్సై వెంకటేష్ వెల్లడించారు. మృతుడు అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ పరిసర ప్రాంతానికి చెందిన చల్ల మల్లికార్జునగా గుర్తించామని తెలిపారు. మృతుడు గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తూ ఉండేవాడని తెలిపారు. వారి కుటుంబ సభ్యులు మృతుడిని గుర్తించారన్నారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.