నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలో ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో కలిసి పర్యటించి గ్రామ ప్రజలకు నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి ఎమ్మెల్యే బాలు నాయక్ శుక్రవారం ఉదయం తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ జనహిత యాత్ర కొనసాగినట్లు తెలిపారు.దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు.